12, ఏప్రిల్ 2011, మంగళవారం

మన్నించుమా నేస్తం....

మన్నించుమా నేస్తం,
            మరుపురాని స్వప్నం,
కానరాని స్నేహం,
            కాదా జీవితానికే శాపం,
మరలి రాదు కాలం,
            నీతో గడిపిన సమయం,
చేజేతులా చేజార్చుకున్న వైనం,
జ్ఞప్తికి వచ్చి రోదించే హృదయం,
నా స్మృతిపథంలో గుభాలించే నీ స్నేహ సౌరభం,
నీ స్నేహ సుగంధపరిమళం తప్ప నువులేవన్న నిజం,
నమ్మనంటోంది నీ జ్ఞాపకాలతో వున్న నా హృదయం,
నమ్మక తప్పదంటోంది కాలం,
అందుకే విడుస్తున్నా అశ్రుతర్పణం.


తిరిగి రానని, వెళ్తున్నాని, మరలి రాని లోకానికి పయనమైపోయిన నేస్తానికి అశ్రునయనాలతో నివాళులర్పిస్తూ......


నను విడిచి మరో లోకానికి వెళ్ళిన నేస్తానికి ఇది అంకితం.

అక్షర ప్రగతి

కదలండి ముందుకు కదం తొక్కుతూ,
                               పలకా బలపం పట్టి,
కదలండి ముందుకు కదం తొక్కుతూ,
ఆవులు పెయ్యలు మేపడమెందుకు,
గొర్రెలు మేకలు కాయడమెందుకు,
పలకా బలపం పట్టాల్సిన వయసులో రాళ్ళు ఎందుకు మోయాలి?
ఆడుతు పాడుతు ఉండక కూలెందుకు చేయాలి?
కలిసి నడుద్దాం ప్రగతి సాదిద్దాం,
కదిలి ముందుకు రణరంగమునకు,
నేటి బాలలే రేపటి పౌరులని మరువద్దోయ్,
వారి భవితకు అడ్డుకట్ట వేయద్దోయ్.

మనం - మన స్నేహం

మనం కలిసిన క్షణం మధురం,
ఆ జ్ఞాపకాలు మదిలో పదిలం,
కలకాలం నిలిచేటి స్నేహం,
జన్మజన్మల అనుబంధం.

కరుణలేని కాలం చేసిన నేరం,
మరు కలయిక తెలియక వేరౌతున్నాం మనం,
మది మోయలేని భారం,
కాట్టీన్యపు విధి వైపరిత్యం.

విధివంచిత కాదు మన స్నేహం,
కలకాలం నిలిచేటి ఉత్తుంగ తరంగం,
తనువులు వేరైనా మనసులు ఒకటైన నేస్తం,
ఎడబాటును చేయనీయకు మనల్ని దూరం.

మనసులెరిగిన మౌనవేదన,
ఇది దుర్మార్గపు దైవ ఘటన,
మనసైన ఓ స్నేహలలన,
మరువకు నను జన్మజన్మాన.



ఇది నా స్నేహితులకు అంకితం.