3, ఏప్రిల్ 2008, గురువారం

జననం - మరణం

జననం మరణం కలియుగ ధర్మం,
బవబంధాలు విధి విలాసం,
వోర్చి నిలువడం ధైర్య లక్షణం,
వెన్ను చూపడం పిరికి లక్షణం,
దాని కన్నను చావే నయం,
ధైర్యానికి ఒకటే మరణం,
పిరికితనానికి ఒకటే జననం,
అరిషడ్వర్గం మృత్యుమందిరం
పరోపకారం ఉత్తమ లక్షణం,
క్షమించడం ఉత్తమోత్తమం,
తప్పు చేయడం మానవ సహజం,
తప్పు దిద్దడం దైవ లక్షణం,
తప్పు దిద్దుకోవడం ఉత్తమతత్వం.

జవరాలా.....!

జవరాలా,
హృదయం లేని ప్రియురాలా!
నే నిన్ను చుడనేల?
తోలిచూపులోనిన్ను ప్రేమించనేల?
నీ స్నేహం కోసం పరితపించనేల?
అది దొరకక చింతించనేల
నిను చూసినమరుక్షణమే,
నా హృదయం నిను ప్రేమించనేల?

మన స్నేహం !

మన స్నేహ బంధం,
అది కాలేజీకే అందం,
అది నిలవాలి చిరకాలం,
అని కోరుకుంటాను కలకాలం.
ఈనాటి మన స్నేహం,
కలిగించాలి మనకు సంతోషం,
ఎవరికీ కలిగించరాదు దుఃఖం,
మనమంతా నవ్వాలి కలకాలం.

ప్రియురాలా!

అలనాడు నిను చూసిన మరుక్షణం,
జలపాతములా ఉరికెను నాలో పరవశం,
అందుకే అందించాను నా హృదయం,
అందుకోవా నా ప్రియ నేస్తం!
మరువకుమా నను నా ప్రియస్వప్నమా !
నను కదిలించిన నా తోలిస్వప్నమా!

To My Dearest

In beginning my race towards my goal,
I see many hurdles on my way,
But with the inspiration you gave me,
To make you as my life forever,
I am beginning my race towards my goal,
You may thimk that I am on a "Wild - Goose Chase",
But I feel I can achieve it,
If you are in my mind to reach you.

My Love

I think to dream you My Love,
All Day & Night, Everyday,
But I can't dream,
Because I can't remeber the loveliest face of you,
But I can only remember smoothest feet of you,
with which I live dreaming u,
You appear like a lightening in my mind,
and then disappears,
Not willing to bear this seperation,
Begging you to appear before my eyes,
Like a star that shine in the sky,
And be my life for ever and ever.

ప్రియా,

ప్రియా,
సిరిమువ్వల గలగలలలో వినిపించె నీ అందెల సవ్వడి,
నీ అందెల సవ్వడి విని నా మదిలో రేగెను అలజడి
నిను చుసిన మరుక్షణమే నా నుండి విడువడి,
నిన్ను చేరినదే నా మది నాకందకుండా పరుగిడి,
అది మొదలు గుండెల్లో శాంతము కొరవడి,
నిను చేరమంటున్నదే నా మది.


క'రెంటు'

సమయానికి వుండదు కరెంటు,
అయినా దానికి కట్టాలి రెంటు,
కట్టేటప్పుడు దాని పేమెంటు,
మన వొళ్ళంతా మంట అంటు,
కరెంటు పోతే ఇక్కట్లు ,
అనుభవిస్తేనే తెలుస్తాయి దాని పాట్లు.

చెలీ

చెలీ,
నీ మీద కవిత రాసేందుంకు నే కాళిదాసును కాను,
నీ ప్రేమ కోసుకునేందుకు నే ప్రేమదాసును కాను,
నీ వెంట వుండేందుకు నీ కాలి అందియను కాను,
మల్లియవైన నీ మకరందాన్ని దోచేందుకు నే తుమ్మెదను కాను,
చిలకమ్మ ప్రేమకై వేచిన గోరింకను నేను,
నీ ప్రేమకై వేచిన ప్రేమపిపాసిని నేను,
నువు చూసే నీ మనసును నేను,
నే రాసిన కవితకు ప్రాణం నువ్వు,
నా ఊహకు భావం నువ్వు,
నా పాటకు రాగం నువ్వు,
నా హృదయానికి స్పందన నువ్వు,
నా శ్వాసకు ఊపిరి నువ్వు

అనాథ

బోసి నవ్వుల పసిపాప,
ఎపుడయ్యావో వీది పాప,
చూసావా చిత్రమైన విధి రాత,
ఎమౌతావో తెలియదు నీ భవిత,
ఎంత దుర్బరమైనదో ఈ ఎదురీత,
ఎలా భరిస్తావో ఈ సమాజపు కాట్టీన్యత,
రాదు జాలి ఎవరికీ నీ మీద,
కలుగదు దయ ఎవరికీ నీ పైన,
పూల బాటలో వెళ్ళాల్సిన బాల్యం,
వెలుతోందా ముళ్ళ బాట వెంట?
రేపటి పౌరులకా ఈ నిస్సహాయత?

నేటి సమాజం

మారుతోంది మారుతోంది కాలం
కుళ్ళుతోంది కుళ్ళుతోంది నేటి సమాజం
ఎక్కడున్నది మానవత్వం?
వున్నదంతా అరాచకత్వం,
ఏమున్నది చూడడానికి?
ఎవరున్నారడగడానికి?
మనకెందుకులే అనుకోకండి?
రేపు మీరు కూడా ఇంతేనండి,
మారుతోంది మారుతోంది కాలం,
ఎన్నడు మారుతుంది నేటి సమాజం?
ఎక్కడ చూసినా లంచం,
పెరిగిపోతోంది ఈ ఘోరం,
ఆపలేరా ఎవరూ ఈ నేరం,
తెలేరా ప్రజలలో చైతన్యం,
ఎటు చూసినా అన్యాయం,
ఎటు తిరిగిన అధర్మం,
ఉదయించదా ఒక ఉద్యమం,
ఆపలేదా ఈ అరాచకత్వం,
ఇట్లయితే ఏమౌతుంది భావి భారతం,
ఇప్పుడౌతోంది కళా విహీనం,
మారింది మారింది కాలం,
ఇంకా మారాలేదా ఈ సమాజం.