17, ఏప్రిల్ 2009, శుక్రవారం

జన్మస్తలమా .......

ఏమి కర్మమిది జన్మస్తలమా !
ఏమి కర్మమిది భరతమాతా !
స్నేహానికి విలువలెదాయెను,
మంచితనానికి కాలం చెల్లెను,
మోసమే రాజ్యమేలెను,
వంచనే పంచన చేరెను,
ఏమి కర్మమిది జన్మస్తలమా !
ఏమి కర్మమిది భరతమాతా !
నయవంచకుల రాజ్యమే ఇది
నమ్మకద్రోహమే సరియైనది,
స్నేహబంధమా నీకు చెల్లు చీటీ ఇదే,
మైత్రీ రూపమా నీ భవిత ఇదే.

Student

Student,
Must be initiant,
Like a great patriot,
To drive the society chariot,
In the way right.

Must be protector,
To the culture & Heritage,
As a preacher,
To his neighbour,
To put his Nation,
In the world of Motion,
To the land of Notion.

Rain

Come Down,
Oh! Holy Rain,
Make the farmer strain,
Fill the Earth's heart with grain,
From the land of GOD,
With full of mud and stud.

Come Down,
Oh! Holy Rain,
Make us happy with the fall of thy,
Come Down,
To tinkle the heart of tree,
With the gailee song of thee.

Come Down,
Oh! Holy Rain.

నేస్తాలం

తరాలు మారినా జగాలు మారినా,
నిలిచే స్నేహానికి నిలువెత్తు సాక్ష్యాలం,
కష్టాల కడలిలో కన్నీటి వరదలో,
పయనించే నావకు చుక్కనియవుతాం,
నేస్తానికి సాయమందుతాం.

కష్టాల కడలి అలలను మా మార్గం చేసి,
కన్నీటి వరదను మా సరదా సైయ్యాటల సెలయేరు చేసి,
నవ్వ్వుల పూవులు పూయిస్తాం,
మా నేస్తాల మోమున ఆనందహేల,
ఉత్సాహ డోలికల ఊయలలూగిస్తాం.

నేస్తాలం మేం నేస్తాలం,
తరాలు మారినా జగాలు మారినా,
నిలిచే స్నేహానికి నిలువెత్తు సాక్ష్యాలం.

విద్య !

విద్య,
కాబోతున్నావా మిథ్య?
కుళ్ళు రాజకీయాల మధ్య,
మళ్లీరాదా నీకు సయోధ్య?
ఆటల నుండి పాటల దాక,
చిన్నల నుండి పెద్దల దాక,
వుంటోంది రాజకీయాల బాట,
మారదా ఈ చరిత్ర పుట ?
రావాలా మరో గాంధీజీ?
లేవాలా మళ్లీ నేతాజీ?
బాగుపడదాఈ భారతావని?
అని రోదిస్తోంది నా హృదయధ్వని.

ప్రియతమా!

నా జీవితం నీకు కానుక చేసి ,
నీ శ్వాసను నా ఊపిరి చేసి,
నా మదిలో నీ బొమ్మను దాచి,
నీ చిరునవ్వుని హరివిల్లుగా తలచి,
మనసిచ్చాను అందుకొమ్మని,
పదిలంగా చూచుకొమ్మని.

ఆ మనసును బొమ్మగా తలిచావు,
చేజార్చి ముక్కలు చేశావు
ఈ మనిషిని రాతిగా మలిచావు,
గుండెలో మానని గాయమైనావు,
మనసులో మాయని మచ్చవై నిలిచావు,
నీకై వేచిన నన్ను చూసి నవ్వుకున్నావు,
గుండె లోతులో గరళాన్ని దాచి,
కరకు హృదయాన్ని కన్నుల మాటునుంచి,
వన్నె చిన్నెల వగలెన్నో చిలకరించి,
నిమ్మలమైన నా మదిలో కల్లోల కడలివైనావు.