తరాలు మారినా జగాలు మారినా,
నిలిచే స్నేహానికి నిలువెత్తు సాక్ష్యాలం,
కష్టాల కడలిలో కన్నీటి వరదలో,
పయనించే నావకు చుక్కనియవుతాం,
నేస్తానికి సాయమందుతాం.
కష్టాల కడలి అలలను మా మార్గం చేసి,
కన్నీటి వరదను మా సరదా సైయ్యాటల సెలయేరు చేసి,
నవ్వ్వుల పూవులు పూయిస్తాం,
మా నేస్తాల మోమున ఆనందహేల,
ఉత్సాహ డోలికల ఊయలలూగిస్తాం.
నేస్తాలం మేం నేస్తాలం,
తరాలు మారినా జగాలు మారినా,
నిలిచే స్నేహానికి నిలువెత్తు సాక్ష్యాలం.
17, ఏప్రిల్ 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి