17, ఏప్రిల్ 2009, శుక్రవారం

ప్రియతమా!

నా జీవితం నీకు కానుక చేసి ,
నీ శ్వాసను నా ఊపిరి చేసి,
నా మదిలో నీ బొమ్మను దాచి,
నీ చిరునవ్వుని హరివిల్లుగా తలచి,
మనసిచ్చాను అందుకొమ్మని,
పదిలంగా చూచుకొమ్మని.

ఆ మనసును బొమ్మగా తలిచావు,
చేజార్చి ముక్కలు చేశావు
ఈ మనిషిని రాతిగా మలిచావు,
గుండెలో మానని గాయమైనావు,
మనసులో మాయని మచ్చవై నిలిచావు,
నీకై వేచిన నన్ను చూసి నవ్వుకున్నావు,
గుండె లోతులో గరళాన్ని దాచి,
కరకు హృదయాన్ని కన్నుల మాటునుంచి,
వన్నె చిన్నెల వగలెన్నో చిలకరించి,
నిమ్మలమైన నా మదిలో కల్లోల కడలివైనావు.

కామెంట్‌లు లేవు: