3, ఏప్రిల్ 2008, గురువారం

చెలీ

చెలీ,
నీ మీద కవిత రాసేందుంకు నే కాళిదాసును కాను,
నీ ప్రేమ కోసుకునేందుకు నే ప్రేమదాసును కాను,
నీ వెంట వుండేందుకు నీ కాలి అందియను కాను,
మల్లియవైన నీ మకరందాన్ని దోచేందుకు నే తుమ్మెదను కాను,
చిలకమ్మ ప్రేమకై వేచిన గోరింకను నేను,
నీ ప్రేమకై వేచిన ప్రేమపిపాసిని నేను,
నువు చూసే నీ మనసును నేను,
నే రాసిన కవితకు ప్రాణం నువ్వు,
నా ఊహకు భావం నువ్వు,
నా పాటకు రాగం నువ్వు,
నా హృదయానికి స్పందన నువ్వు,
నా శ్వాసకు ఊపిరి నువ్వు

కామెంట్‌లు లేవు: