3, ఏప్రిల్ 2008, గురువారం

నేటి సమాజం

మారుతోంది మారుతోంది కాలం
కుళ్ళుతోంది కుళ్ళుతోంది నేటి సమాజం
ఎక్కడున్నది మానవత్వం?
వున్నదంతా అరాచకత్వం,
ఏమున్నది చూడడానికి?
ఎవరున్నారడగడానికి?
మనకెందుకులే అనుకోకండి?
రేపు మీరు కూడా ఇంతేనండి,
మారుతోంది మారుతోంది కాలం,
ఎన్నడు మారుతుంది నేటి సమాజం?
ఎక్కడ చూసినా లంచం,
పెరిగిపోతోంది ఈ ఘోరం,
ఆపలేరా ఎవరూ ఈ నేరం,
తెలేరా ప్రజలలో చైతన్యం,
ఎటు చూసినా అన్యాయం,
ఎటు తిరిగిన అధర్మం,
ఉదయించదా ఒక ఉద్యమం,
ఆపలేదా ఈ అరాచకత్వం,
ఇట్లయితే ఏమౌతుంది భావి భారతం,
ఇప్పుడౌతోంది కళా విహీనం,
మారింది మారింది కాలం,
ఇంకా మారాలేదా ఈ సమాజం.

కామెంట్‌లు లేవు: